లింగ వివక్షగురించి సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
- IndiaGlitz, [Monday,December 14 2020]
స్త్రీ, పురుషుల సమానత్వం గురించి హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ లింగ వివక్షణతను ఆమె ప్రశ్నించారు. స్త్రీ, పరుషుల మధ్య అసమానతలు సినీ పరిశ్రమలోనే కాదు.. అన్నీ చిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నాయని సాయి పల్లవి తెలిపారు. ఇదే సందర్భంలో ఈమె, హీరో రానాను పొగడ్తలతో ముంచెత్తారు. రానా వంటి హీరోతో 'విరాటపర్వం'సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తను లింగ వివక్షతను చూడడు. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు కేవలం నటించడమే నా బాధ్యత అనుకున్నాను. సినిమాలో నా పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి పోసర్ట్స్లో నా పేరు వేయించేలా రానా జాగ్రత్త తీసుకున్నాడని అన్నారు సాయిపల్లవి.
సాయిపల్లవి నటించిన వెబ్ సిరీస్ అంథాలజీ 'పావ కథైగల్'లో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఓ భాగంలో సాయిపల్లవి ప్రకాశ్‌రాజ్‌తో కలిసి నటించారు. ఈ అంథాలజీకి సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి ఈ కామెంట్స్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'విరాటపర్వం'తో పాటు నాని 'శ్యామ్ సింగరాయ్'లోనూ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు.