ద‌ర్శ‌కుడికి నో చెప్పిన సాయిప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Monday,December 03 2018]

'ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు త‌మిళంలో కూడా వ‌రుస సినిమాలు చేస్తుంది. అయితే ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతుంది సాయిప‌ల్ల‌వి.

రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ సాయిప‌ల్ల‌విని క‌లిసి సినిమా క‌థ‌ను వివ‌రించాడ‌ట‌. సినిమాలో త‌న పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని అనిపించ‌డంతో సినిమా చేయ‌లేనని సాయిప‌ల్ల‌వి క్లారిటీ ఇచ్చేసింద‌ట‌.

'ఉయ్యాల జంపాల', 'మ‌జ్ను' చిత్రాల దర్శ‌కుడు విరించి వ‌ర్మ‌..తదుప‌రిగా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ రామ్‌తో చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసమే విరించి వ‌ర్మ హీరోయిన్‌ను వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాట్ట‌.