సాయి ప‌ల్ల‌వి ఆప‌ర్‌ను వ‌ద్దందా?

  • IndiaGlitz, [Monday,August 20 2018]

హీరోయిన్స్‌ను విష‌యానికి వ‌స్తే.. వారి కెరీర్ టైమ్ త‌క్కువ‌గా ఉంటుంది. అందుక‌నే వారు ఉన్నంతలో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని అనుకుంటారు. వ‌చ్చిన అవకాశాల‌ను ఏ మాత్రం వ‌దులుకోరు. కానీ సాయిప‌ల్ల‌వి తాను మాత్రం అందుకు భిన్న‌మ‌ని అంటుంది. అందుకు కార‌ణం..

రీసెంట్‌గా ఆమెకు వ‌చ్చిన ఓ అవ‌కాశాన్ని ఆమె వ‌ద్ద‌నుకోవ‌డ‌మే.. యువ క‌థానాయ‌కుడు బెల్ల‌కొండ శ్రీనివాస్ సినిమాలో న‌టించమ‌ని .. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే సాయిప‌ల్ల‌వి ఎందుక‌నో.. న‌టించ‌న‌ని చెప్పేసింద‌ట‌. ఇప్పుడు ఆ సినిమాలో మెహ‌రీన్ న‌టించ‌బోతుంది. సాక్ష్యం త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రెండు సినిమాల‌ను చేస్తున్నారు. రెండింటిలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.