సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిదా చిత్రంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలర్ బ్యూటీ సాయి పల్లవి. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ చేసిన ఎంసీఏ కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తమిళంలో సాయి పల్లవి తాజాగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి ధనుష్ చిత్రం కాగా.. మరొకటి సూర్య నటించనున్న చిత్రం. విశేషమేమిటంటే..
ఈ సినిమాలు ఎప్పుడో ప్రారంభమైనా.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోనూ నటనకి అవకాశమున్న పాత్రలో సాయిపల్లవి కనిపించబోతోందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలకి కూడా యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు కావడం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com