చెల్లెలికు సాయిపల్లవి ప్రేమలేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటనతో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది సాయిపల్లవి. తన ఫ్యామిలీతో ప్రస్తుతం క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ చెన్నై పొన్ను. తన కుటుంబంలో చెల్లెలు పూజా కన్నన్ అంటే సాయిపల్లవికి ఎంతో ప్రేమ. ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ సాయిపల్లవి ఓ లేఖ రాసింది. ‘‘నువ్వు నా కోసం చేసిన త్యాగాలు. రాజీపడిన అంశాలను తెలియనీయకుండా చేసిన తీరు. నా జీవితానికి నువ్విచ్చిన అర్థం. నాలో నువ్వు నింపిన ఆనందం. ఎప్పుడూ చిరునవ్వులు చిందే నీ నవ్వు. నీ ఉనికి నా ప్రపంచాన్ని గొప్పగా మార్చింది. నా జీవితంలో నువ్వుండటం నా అదృష్టం. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. హ్యాపీ బర్త్ డే మంకీ’’ అంటూ సాయిపల్లవి మెసేజ్ చేశారు. అంతే కాకుండా చెల్లెలతో తాను ఉన్న కొన్ని రేర్ ఫొటోస్ షేర్ చేశారు.
ఫిదాతో సక్సెస్ అందుకున్న సాయిపల్లవి ..డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్యతో లవ్‌స్టోరి సినిమాలో నటిస్తోంది. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే రానాతో విరాటపర్వం సినిమాలోనూ జత కట్టింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com