చెల్లెలికు సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లేఖ‌

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

విల‌క్ష‌ణ న‌ట‌న‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. త‌న ఫ్యామిలీతో ప్ర‌స్తుతం క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ చెన్నై పొన్ను. త‌న కుటుంబంలో చెల్లెలు పూజా క‌న్న‌న్ అంటే సాయిప‌ల్ల‌వికి ఎంతో ప్రేమ‌. ఆమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ సాయిప‌ల్ల‌వి ఓ లేఖ రాసింది. ‘‘నువ్వు నా కోసం చేసిన త్యాగాలు. రాజీపడిన అంశాలను తెలియనీయకుండా చేసిన తీరు. నా జీవితానికి నువ్విచ్చిన అర్థం. నాలో నువ్వు నింపిన ఆనందం. ఎప్పుడూ చిరునవ్వులు చిందే నీ నవ్వు. నీ ఉనికి నా ప్రపంచాన్ని గొప్పగా మార్చింది. నా జీవితంలో నువ్వుండటం నా అదృష్టం. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. హ్యాపీ బర్త్ డే మంకీ’’ అంటూ సాయిప‌ల్ల‌వి మెసేజ్ చేశారు. అంతే కాకుండా చెల్లెల‌తో తాను ఉన్న కొన్ని రేర్ ఫొటోస్ షేర్ చేశారు.

ఫిదాతో స‌క్సెస్ అందుకున్న సాయిప‌ల్ల‌వి ..డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరి సినిమాలో న‌టిస్తోంది. ఇది విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే రానాతో విరాట‌ప‌ర్వం సినిమాలోనూ జ‌త క‌ట్టింది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

More News

వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష..: కేంద్ర ప్రభుత్వం

కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులు, వారి బంధువులు

బాల‌య్య 106కు కొత్త చిక్కులు..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం

సరదా కోసం బయటికి రావడం మూర్ఖత్వం: కీరవాణి

లాక్‌డౌన్ సమయంలో సరదా కోసం కొందరు బయటికొస్తున్నారని.. నిజంగా అలా రావడం మూర్ఖత్వం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వ్యాఖ్యానించారు.

తార‌క్ ట్వీట్‌కు వెంకీ ఫన్నీ రీ ట్వీట్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోన్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లోని మ‌హిళ‌ల‌కు చేదోడు వాదోడుగా ఉండాల‌ని సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్‌లో ముందు

నిరూపిస్తే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటా: వైసీపీ ఎమ్మెల్యే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.