‘షీ సేఫ్’ యాప్‌ను ప్రారంభించిన సాయిపల్లవి
- IndiaGlitz, [Thursday,February 20 2020]
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని మహిళ భద్రత కోసం రూపొందించిన షీ సేఫ్ అనే ప్రత్యేకమైన యాప్‌ను గురువారం హీరోయిన్ సాయిపల్లవి ప్రారంభించారు. హెచ్ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సోసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ కలయికలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్, ఇన్సెపెక్టర్ జనరల్ స్వాతి లక్రా, టెస్సీ థామస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి షీ సేఫ్ యాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదు. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు వారు షీ సేఫ్ యాప్‌తో భద్రత కోసం మనకు మరింత చేరువయ్యారు. వారి అండదండలతో మహిళలు నిశ్చితంగా ఉంటున్నారు. పోలీసులకు సహకరించడం మన బాధ్యత’’అని తెలిపారు. నాగచైతన్యతో సాయిపల్లవి కలిసి ‘లవ్‌స్టోరి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. అలాగే రానాతో కలిసి వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ సినిమాలోనూ నటిస్తున్నారు.