మల్టీస్టారర్ మూవీలో సాయిపల్లవి?
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిదాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఆ చిత్రంలోని తన నటనతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం నానితో ఎం.సి.ఎ సినిమా చేస్తోంది. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలను నిర్మించిన దిల్ రాజు సంస్థలోనే మరో సినిమా చేయబోతోంది సాయి పల్లవి.
మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నితిన్, శర్వానంద్ కథానాయకులుగా నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉండగా.. ఒకరిగా సాయిపల్లవి ఎంపికైందని తెలిసింది.
వాస్తవానికి దిల్ రాజు నిర్మించనున్న శ్రీనివాస కల్యాణంలో తొలుత సాయిపల్లవి పేరే వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయింది. అయితే.. ఈ మల్టీస్టారర్ మూవీని మాత్రం వెంటనే చేయడానికి అంగీకరించిందట. దాగుడు మూతలు అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments