మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సాయిపల్లవి?

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

ఫిదాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి. ఆ చిత్రంలోని త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసిన ఈ అమ్మ‌డు.. ప్ర‌స్తుతం నానితో ఎం.సి.ఎ సినిమా చేస్తోంది. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల‌ను నిర్మించిన దిల్ రాజు సంస్థ‌లోనే మ‌రో సినిమా చేయ‌బోతోంది సాయి ప‌ల్ల‌వి.

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో నితిన్‌, శ‌ర్వానంద్ క‌థానాయ‌కులుగా న‌టించనున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థానం ఉండ‌గా.. ఒక‌రిగా సాయిప‌ల్ల‌వి ఎంపికైంద‌ని తెలిసింది.

వాస్త‌వానికి దిల్ రాజు నిర్మించ‌నున్న శ్రీ‌నివాస క‌ల్యాణంలో తొలుత సాయిప‌ల్ల‌వి పేరే వినిపించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా చేయ‌లేకపోయింది. అయితే.. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని మాత్రం వెంట‌నే చేయ‌డానికి అంగీకరించింద‌ట‌. దాగుడు మూత‌లు అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.

More News

శేఖ‌ర్ క‌మ్ముల హీరోల మ‌ధ్య పోటీ

ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ జోన‌ర్‌లో ఆయ‌న రూపొందించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా మంచి విజ‌యం సాధించాయి.

రెండొ వారంలొకి అడుగుపెట్టిన 'ఇంద్రసేన'

పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి.

కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.

2.0 నిర్మాత‌ల కేసు..

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్

తాజాగా జవాన్చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.