మణిరత్నంతో సాయిపల్లవి?
Send us your feedback to audioarticles@vaarta.com
నేటి తరం హీరోయిన్స్‌లో సాయిపల్లవి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ తమివళ పొన్ను రానాతో ‘విరాటపర్వం’ సినిమాతో పాటు... నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లవ్‌స్టోరి’లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు సెట్స్‌పైనే ఉన్నాయి. ఇవి కాకుండా ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి సాయిపల్లవి ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఏస్ డైరెక్టర్ మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్ కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారట. ‘నవరస’ పేరుతో రూపొందబోయే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉంటాయి. వీటిని తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించనున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఓ ఎపిసోడ్‌ను ‘అసురన్’ ఫేమ్ వెట్రిమారన్ తెరకెక్కించునున్నారట. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ ఎపిసోడ్‌లో విలక్షణ నటుడు తండ్రిగా, సాయిపల్లవి కూతురు పాత్రల్లో నటిస్తున్నారట. మరి మిగిలిన ఎపిసోడ్స్‌ను ఎవరు తెరకెక్కిస్తారు? అందులో ఎవరు నటిస్తారు? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com