యాక్షన్‌లో సాయిపల్లవి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిదా,ఎం.సి.ఎ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సాయిపల్లవి. ఈ అమ్మడు.. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో హీరోయిన్ పక్కన రొమాంటిక్ యాంగిల్లో, పెర్ఫామెన్స్‌తో కూడిన పాత్రల్లోనే నటించింది.
అయితే ఇప్పుడు తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించబోతుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ మలయాళ సినిమా చేస్తుంది సాయిపల్లవి. ఇందులో పహాద్ ఫాజిల్‌తో కలిసి నటిస్తుంది. వివేక్ దర్శకుడు.
థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. అందులో ఒకటి హీరో చేస్తే.. మరొకటి హీరోయిన్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో `పడి పడి లేచె మనసు` సినిమాలో నటిస్తుంది సాయిపల్లవి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments