ఆ పుకారు ఎవరో పుట్టించారో తెలియదంటున్న సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. డిసెంబర్ 21న సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇటు తెలుగు, అటు తమిళ్లో రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. రెండు సినిమాలను ముందు నుండి సమాంతరంగా షూట్ చేస్తూ వస్తున్నాం. అలాగే రిలీజ్ కూడా ఒకేసారి అయ్యింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నటిగా రెండు సినిమాల నుండి ఫీడ్ బ్యాక్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఏదీ జరిగినా మన మంచిదే అని ఫీలవుతాను. నేను, శర్వా ఆ క్యారెక్టర్స్‌ను ఫీలై చేశాం. నటనలో ఇద్దరికీ ఫీలింగ్ ఉంటేనే అది తెరపై కనపడుతుంది. నేను ఎవరినీ డామినేట్ చేయను. డామినేట్ చేస్తానని ఎవరూ చెబుతున్నారో తెలియడం లేదు. శర్వానంద్ పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను సీనియర్, హీరోయిన్ జూనియర్.. మొన్ననే వచ్చింది కదా!, అనే ఫీలింగ్ తనకు ఉండదు. నాకు కంఫర్ట్ ఇచ్చారు శర్వా. నేను, తను మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరికీ ఈగోలు లేవు. మేం ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఈ సినిమాలో మెడికోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పర్టికులర్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నాకు రెండేళ్ల ముందు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com