ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యి 'కణం' సినిమా చేశాను - సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
'ఛలో'తో సూపర్‌హిట్ కొట్టిన నాగశౌర్య, 'ఫిదా', 'ఎంసిఎ' వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన సాయిపల్లవి జంటగా ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. శ్యాం సి.ఎస్. సంగీత సారధ్యం వహించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం మార్చి 5న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, జెమిని కిరణ్, శానం నాగ అశోక్‌కుమార్, హీరోయిన్ సాయిపల్లవి, చిత్ర దర్శకుడు విజయ్, కెమెరామెన్ నిరవ్‌షా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్. ప్రేమ్, బేబి విరోనికా, పాటల రచయిత కృష్ణ మాదినేని, మాటల రచయిత సత్య, ప్రత్యూష తదితరులు పాల్గొనగా ఎన్.వి.ఆర్. సినిమా అధినేత ఎన్.వి. ప్రసాద్ ఫ్లవర్ బొకేలను అందించారు.
ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 'కణం' ఆడియో సీడిలను రిలీజ్ చేసి తొలి సీడిని హీరోయిన్ సాయిపల్లవికి అందించారు.
ఎన్.వి.ఆర్. సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - "'కణం' సినిమాను తెలుగులో మా ఎన్.వి.ఆర్. సినిమా బ్యానర్‌పై విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగశౌర్య, సాయిపల్లవి ఇద్దరూ హ్యాట్రిక్ సక్సెస్‌లను ఈ సినిమాతో సాధించాలని కోరుకుంటున్నాను. 'విక్రమ్ వేద' సినిమాకు సంగీతం అందించిన శామ్ సి.ఎస్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో అతను గొప్ప సంగీత దర్శకుడిగా పేరు వస్తుంది.
రజనీకాంత్ '2.0'కి కెమెరా వర్క్ అందించిన నిరవ్షాగారు ప్రతి విజువల్‌ను గొప్పగా పిక్చరైజ్ చేశారు. సినిమాలో వెరోనికా అనే చిన్న పాప అద్భుతమైన పాత్రలో నటించింది. డైరెక్టర్ విజయ్‌గారు ఓ మంచి ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. ఆ ఉద్దేశం నేరవేరాలని కోరుకుంటున్నాను. సినిమాను ఇంత గ్రాండియర్‌గా 37 రోజుల్లో పూర్తి చేయడమంటే చిన్న విషయం కాదు.
సినిమాలో కాస్త యాక్షన్ పార్ట్ ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో సినిమాను 37 రోజుల్లో పూర్తి చేశారు. సినిమా నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి గొప్ప సినిమాను తెరకెక్కించారు. ఇంత మంచి సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన లైకా సంస్థ ప్రతినిధులు సుభాష్ కరణ్, కరుణా కరణ్, రాజ మహాలింగంలకు థాంక్స్'' అన్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ - ''నాగశౌర్య, సాయిపల్లవి, వెరోనికా, డైరెక్టర్ విజయ్ సహా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నా మిత్రుడు ఎన్.వి.ప్రసాద్‌కు, సినిమా నటించిన అందరికీ అభినందనలు'' అన్నారు.
శానం నాగ అశోక్‌కుమార్ మాట్లాడుతూ - ''నాగశౌర్య, సాయిపల్లవిలు మంచి సక్సెస్‌లో ఉన్నారు. వారికి ఈ సినిమా మరో పెద్ద సక్సెస్‌ను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
కెమెరామెన్ నిరవ్ షా మాట్లాడుతూ - ''తెలుగులో నా మూడో సినిమా ఇది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ - ''మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కరు సినిమానే తెలుగులో కణంగా విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళంలో సినిమాను తెరకెక్కించాం. ఎన్.వి.ప్రసాద్‌గారు ఎంతో ప్యాషనేట్‌గా సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. 2013లో ఈ సినిమా పాయింట్ నాకు ఆలోచనలోకి వచ్చింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి తెరకెక్కించాను. సాయిపల్లవి, వెరోనికా, నాగశౌర్యలు అద్భుతంగా నటించారు'' అన్నారు.
హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ - ''తల్లికి, బిడ్డకు మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ సినిమా కథ. సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయి చేశాను. సినిమాలో నటించడం వల్ల వెరోనికాతో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాను చూసిన ప్రేక్షకులకు ఆనందంగా, మంచి ఫీలింగ్‌తో ఇంటికి వెళ్లానలే ఆలోచనతో విజయ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. నాగశౌర్య బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఫిదా, ఎంసిఎ సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకముంది. ఇలాంటి కథను నమ్మి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్ష్న్స్కు థాంక్స్'' అన్నారు.
ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్ సి.ఎస్., ఎల్.జయశ్రీ, స్టంట్ సిల్వ, ఆంటోని, విజయ్, సత్య, పట్టణం రషీద్, ఎం.ఆర్.రాజకృష్ణన్, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్.ఎం.రాజ్‌కుమార్, ఎస్.శివశరవణన్, షియామ్ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్, సమర్పణ: ఎన్.వి.ఆర్. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: విజయ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments