ఇక సినిమాలు చాలు అని అనుకున్నప్పుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తా - సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం `ఫిదా`. జూలై 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తెలంగాణ అమ్మాయి భానుమతి పాత్రలో సాయిపల్లవి నటన అందరినీ అలరిస్తుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మీడియాతో సినిమా గురించిన సంగతులను పంచుకుంది. సాయిపల్లవి మాట్లాడుతూ - ``ఫిదా సినిమా కోసం వర్క్ షాప్ చేశాను. నిజానికి నేను మలయాళంలో ప్రేమమ్ కోసం వర్క్‌షాప్ చేయలేదు.
ఓ సినిమా అనేది డైరెక్టర్ కల. ఆ కలను నేరవేర్చాలంటే అందరూ కష్టపడాలి కాబట్టి నా వంతు కష్టాన్ని నేను పడ్డాను . ఇందులో నా డైలాగులు ఇంపార్టెంట్ కాబట్టి డిస్కషన్ చేసుకున్నాం. భాననుమతి క్యారెక్టర్ చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. కానీ నిజ జీవితంలో నేను చాలా సాఫ్ట్‌గా ఉంటాను డైరెక్టర్ శేఖర్‌గారు సినిమా కోసం ఏం చెబితే అది చేసుకుంటూ వచ్చాను తెలంగాణ స్లాంగ్ కూడా అంతే మా దర్శకుడు, డైరక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లంతా కలిసి నేర్పించారు. ఈజీగా నేర్చుకోగలిగాను.
అలాగే ట్రాక్టర్ తోలడం నేర్చుకున్నా. చాలా కష్టం ఆ పని చేయడం.. ఎలా చేస్తారో పాపం.. అలాగే నాట్లు నాటడం కూడా బాగా వచ్చింది.నేను తమిళ అమ్మాయిని కాబట్టి తమిళంలో రజనీసార్, కమల్ సార్ అంటే ఎవరు ఇష్టపడరు. ఇక వీరిద్దరి తర్వాత సూర్యగారంటే ఇష్టం. కాక్క కాక్క ఇసనిమాలో సూర్య, జ్యోతికల నటన అంటే ఇష్టం. ఇక నేను పర్సనల్ విషయానికి వస్తే జార్జియాలో డాక్టర్ చదివాను. కార్డియాలజీ చదవాలని కోరిక ఉంది. ఇక సినిమాలు చాలు అని అనుకున్నప్పుడు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తాను. వరుణ్ తేజ్ చాలా మంచి వ్యక్తి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. చాలా కామ్‌గా ఉంటారు. ఏ సన్నివేశానికి ఎంత కావాలో అంత నటించడం అతనికి చాలా బాగా తెలుసు. ప్రస్తుతం తెలుగులో నానితో ఎం.సి.ఎ సినిమాతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments