మహేశ్ సరసన సాయి నో.. రష్మిక గ్రీన్ సిగ్నల్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన నటించడానికి తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ టాపర్స్కూడా పోటీపడుతుంటారన్న విషయం జగమెరిగిన సత్యమే. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో కూడా పలువురు హీరోయిన్స్.. మహేశ్‌తో నటించాలని ఉందని తమ మనసులోని మాటను చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు పలువురు సీనియర్ హీరోయిన్స్ సైతం మహేశ్ పక్కన సింగిల్ చాన్స్ వస్తే చాలని వేయి కళ్లతో వేచి చూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆమె మాత్రం మహేశ్ సరసన నటించేందుకు ‘నో’ చెప్పేసిందట. ఆ భామ నో చెప్పింది ఆలస్యం నేను రెడీ అంటూ మరో ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇంతకీ నో చెప్పిందెవరు..? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందెవరన్న విషయం ఇప్పుడు చూద్దాం.
‘పోకిరి’కి నో చెప్పిన ‘ఫిదా’ పోరీ!
‘ఎఫ్2’- తో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. సూపర్‌స్టార్‌తో మహేశ్ష్బాబు సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నీ సెట్ అయ్యాయ్.. మహేశ్ సరసన నటించేందుకు సరైన హీరోయిన్ దొరకలేదట. అయితే మొదట ‘ఫిదా’ పోరీ సాయి పల్లవి అయితే బాగుంటుందని అనిల్‌కు దిల్ రాజు చెప్పినట్లు సమాచారం. సాయి పల్లవిని అనిల్ సంప్రదించి కథ మొత్తం చదివి వినిపించారట. కథ మొత్తం విన్న ఆ ముద్దుగుమ్మ ‘సారీ.. నేను నటించను..’ అని సింపుల్‌గా తేల్చేసిందట.
నేను రెడీ అంటున్న గీత..!
వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న అయితే మహేశ్‌గా సరిగ్గా సెట్ అవుతుందని భావించిన అనిల్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే మహేశ్ సరసన అనగానే ఎగిరిగంతేసిన ఈ ముద్దుగుమ్మ స్టోరీ వినకముందే ‘నేను రెడీ..’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో అనిల్, దిల్‌రాజు ఇద్దరూ రష్మికను ఓకే చేసేశారట. త్వరలోనే ఈ భామకు స్క్రీన్ టెస్ట్ ఉంటుందని.. అనంతరం హీరోయిన్ రష్మికేనని అఫిషియల్‌గా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘గీత గోవిందం’ సక్సెస్ అయినప్పుడు ట్వి్ట్టర్ వేదికగా ఎంటైర్టీమ్పై మహేశ్ ప్రశంసలజల్లు కురిపించిన విషయం తెలిసిందే.
సాయి నో చెప్పింది ఇందుకేనా..!?
సాయి పల్లవి ఎక్కువగా తన ప్రాముఖ్యత ఉండే పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతుంటుంది. తనకు సరైన పాత్ర లేదని తెలిసినా.. హీరోదే ఎక్కువగా పాత్ర ఉందని తెలిసినా ఆమె నటించడానికి సాహసించదని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మహేశ్ పక్కన నటించేందుకు ఈ భామ ఆసక్తి చూపలేదంటే బహుశా పాత్ర నచ్చకపోయిండొచ్చు అని పుకార్లు వస్తున్నాయి. మరో కోణంలో ఆలోచిస్తే.. సాయి పల్లివి ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరసపెట్టి సినిమాలు చేస్తోంది. దీంతో డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ భామ ఒప్పుకొని ఉండకపోవచ్చేమోనని కొందరు అంటున్నారు. అయితే ఈ మహేశ్ సరసన నటించే చాన్స్ మిస్ చేసుకున్నందుకు ఆమె అభిమానులు.. ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారట. సాయి పల్లివి నో చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత..? రష్మిక రెడీ అన్నదా లేదా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే అఫిషియల్ ప్రకటన వెలువడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments