అక్టోబర్ 1న 'సాయి నీ లీలలు' పాటలు రికార్డింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
కరుణామయుడిగా, వేమనగా, ఆంద్రకేసరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నట పిపాసి విజయ్ చందర్. తాజాగా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానంద సమర్ధ సద్గురువుగా భక్తులచే కీర్తించబడే శ్రీ షిరిడి సాయినాధుని కథను 'సాయి నీ లీలలు' టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్ చందర్ దర్శకత్వ పర్యవేక్షణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
కాగా ఈ సినిమా పాటల రికార్డింగ్ పనులు అక్టోబర్ 1వ తేదిన నిరాడంబరంగా మొదలు కానున్నాయి. ఆ యోగి రాజు సజీవ సమాధి చేరి శతాబ్ధం గడుస్తున్న సందర్భంలో సాయి భక్తులంతా భక్తి పారవశ్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు. వారి సంబరాలను పదింతలు చేసేందుకు 'సాయి నీ లీలలు' మరింత సమాయత్తం అవుతోంది. ఈ శుభ సందర్భంగా సంగీత దర్శకులు ఆది-అనంత్ లకు శుభాశీస్సులు అందిస్తూ అందరి ప్రోత్సాహంతో సినిమా నిర్మాణం సాగాలని విజయ్ చందర్ ఆశిస్తున్నారు.
1986 లో విజయ్ చందర్ నటించిన శ్రీ షిరిడీ సాయి మహత్యం చిత్రం విడుదలై సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఈ చిత్రం రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత షిరిడి స్వరూపంలో ఎంత మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సాయిభక్తుడు విజయ్ చందర్ లోనే బాబాను చూసుకున్న సందర్భాలు కోకొల్లలు. 30 సంవత్సరాల తర్వాత అదే బాబా గారి ఆశీస్సులతో సాయి నీలలుతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. షిరిడీ సాయి బాబా లీలలు అనేకం. వాటిలో ముఖ్యమైనవి, ముక్తిదాయకమైనవి ఏరి పూసగుచ్చి సాయిభక్తులకి అందించాలన్నదే ఈ చిత్రం సంకల్పం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com