సూర్య తాజా చిత్రం హక్కులు సొంతం చేసుకొన్న 'సాయిమణికంఠ క్రియేషన్స్‌'

  • IndiaGlitz, [Monday,August 24 2015]

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్‌ కలిగిన కథానాయకుడు సూర్య. గజిని, యముడు, సింగం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న వెర్సటైల్‌ సూపర్‌స్టార్‌ అతను. ఇక తమిళ చిత్రసీమలో సంచలనాలకు తాజా చిరునామాగా నిులుస్తున్న దర్శకుడు పాండిరాజ్‌. పసంగ, మెరీనా, కేడి బిల్లా'కిలాడి రంగా' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్‌ డైరెక్టర్‌' ఇమేజ్‌ సొంతం చేసుకొన్న దర్శకుడతను.

అందుకే.. సూర్య~ పాండిరాజ్‌ కాంబినేషన్‌'లో తమిళంలో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందులోనూ ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తుండడం మరో ముఖ్య విశేషం. సూర్య సరసన అమలాపాల్‌ నటిస్తుండగా.. మన తెలుగమ్మాయి బిందుమాధవి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. షూటింగ్‌ కార్యక్రమాు దాదాపుగా పూర్తి కావచ్చిన.. ఇంకా పేరు పెట్టనిఈ చిత్రం తెలుగు హక్కుల్ని అత్యంత తీవ్ర పోటీ నడుమ సాయిమణికంఠ క్రియేషన్స్‌' అథినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి సొంతం చేసుకొన్నారు.

సూపర్‌స్టార్‌ సూర్య~ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వ సమర్పణలో.. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌~ స్టూడియో గ్రీన్‌ మరియు శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్‌తో కలిసి సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జూలాకంటి .మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమిళంలో సూపర్‌స్టార్‌ సూర్య నిర్మిస్తున్న సినిమాను.. ఆయన సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో పెద్ద నిర్మాతలు ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం పోటీ పడినా.. మా మీద నమ్మకంతో ఈ అవకాశం మాకే ఇచ్చారు. ఈ సినిమా హక్కులు మేం తీసుకొన్నామని తెలుసుకొన్న మరుక్షణం.. ఇటీవలే జిల్లా' చిత్రంతో సూపర్‌హిట్‌ సొంతం చేసుకొన్న శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్‌' అధినేతలు ప్రసాద్‌ సన్నితి~ తమటం కుమార్‌రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు' అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్ , సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య~ కె.ఇ.జ్థాన్‌వేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ'స్క్రీన్‌ప్లే'దర్శకత్వం: పాండిరాజ్‌!!

More News

'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తి

సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది.

సూర్య టైటిల్ మారుతుంది

తమిళ స్టార్ సూర్య హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు.

'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' నా మనసుకి దగ్గరైన సినిమా - హీరో నితిన్

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పణలో గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’.

పవన్ ఓకే చెప్పాడట...

చిన్న, పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. శిరీష్, లక్ష్మణ్ ల సహకారంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'ప్రేమంటే సులువు కాదురా'

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’.