సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

సాయిధ‌ర‌మ్‌తేజ్ - ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం విన్న‌ర్‌. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా విన్న‌ర్ ఫ‌స్ట్ ట్రైల‌ర్ ను రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ....రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు విన్న‌ర్ ఫ‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్నాం. టైమ్ కాస్త అటు ఇటు అయితే క్ష‌మించండి అన్నాడు.

ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. మ‌రి...విన్న‌ర్ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను ఎంత వ‌ర‌కు గెలుచుకుంటాడో చూడాలి..!