చిరు ట్యాగ్ లైన్‌తో సాయిధరమ్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ తరువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు సరైన హిట్ పడలేదు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్.. ఇలా సాయిధరమ్ చేసిన ప్రతి చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పల్టీకొట్టింది. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ తదుపరి చిత్రంపైనే పెట్టుకున్నాడు. 20 ఏళ్ళ క్రితం తన చిన మావయ్య పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ అనే మెమరబుల్ మూవీని ఇచ్చిన ఎ.కరుణాకరన్ ఈ సినిమాకి దర్శకుడు. అలాగే పెదమావయ్య చిరంజీవితో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాత.
కాగా.. తాజాగా ఈ సినిమాకి తేజ్ ఐ లవ్ యు అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం చిరంజీవి హీరోగా నటించిన డాడీ చిత్రానికి కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉంది. అలాగే చిరు కెరీర్ ప్రారంభంలో ఐ లవ్ యు అనే పేరుతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొత్తానికి.. మావయ్య టైటిల్, ట్యాగ్ లైన్ మరోసారి సాయిధరమ్ సినిమా టైటిల్లోనూ కనిపించనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout