తొలి గురువుకు విషెస్ తెలియచేసిన తేజు..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి గురువుకు బర్త్ డే విషెస్ తెలియచేసాడు హీరో సాయిధరమ్ తేజ్. ఇంతకీ తేజు తొలి గురువు ఎవరనుకుంటున్నారా..? డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి. సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం రేయ్. ఈ చిత్రాన్ని వై.వి.ఎస్.చౌదరి స్వీయ దర్శత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో వై.వి.ఎస్ చౌదరి నుంచి చాలా నేర్చుకున్నాడట. అందుకనే నా తొలి గురువు వై.వి.ఎస్ చౌదరి అని చెబుతున్నాడు తేజు.
అయితే ఈరోజు వై.వి.ఎస్ చౌదరి పుట్టినరోజు ఈ సందర్భంగా తేజు ట్విట్టర్ లో స్పందిస్తూ...ఫస్ట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. ఫస్ట్ టీచర్ వై.వి.ఎస్ గారు హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేసాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments