‘సోలో లైఫే సో బెటర్’ అంటూనే గుడ్ బై చెప్పబోతున్నాడుగా..

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

మెగా హీరో సాయి తేజ్ అప్ కమింగ్ మూవీ ‘సోలో లైఫే సో బెటర్’. అయితే సాయి తేజ్ సోలో లైఫే సో బెటర్ అంటూనే సోలో లైఫ్‌కి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇప్పటి వరకూ సాయితేజ్ వివాహం విషయమై ఎన్నో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఈ సారి మాత్రం ఫిక్స్ అయిపోయినట్టే తెలుస్తోంది. 33 ఏళ్ల ఈ సుప్రీం హీరో తనకు అమ్మాయిని వెదికే బాధ్యతను తన తల్లికే అప్పజెప్పాడు. దీంతో ఆమె సాయి తేజ్ కోసం ఆంధ్రాకు చెందిన ఓ మంచి అమ్మాయిని వెదికి పెట్టిందట. అమ్మ సెలక్షన్‌కి మెగా హీరో కూడా జై కొట్టేశాడని సమాచారం.

ఆంధ్రాలో ఉన్న సాయి తేజ్ బంధువుల ద్వారా ఈ మ్యాచ్ వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధం అన్ని విధాలా అనుకూలం అనిపించడంతో సాయితేజ్ తల్లి కుమారుడికి చెప్పినట్టు సమచారం. కుమారుడు కూడా ఓకే అనడంతో విషయాన్ని తన సోదరుడు మెగాస్టార్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో మెగాస్టార్ కూడా ఓకే చెప్పారట. మొత్తానికి ఆ రకంగా మన సుప్రీం హీరోకి మ్యాచ్ సెట్ అయిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మన సాయి తేజ్ తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే యంగ్ హీరోలు పలువురు బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. నితిన్, రానా, నిఖిల్ తదితరులు గుడ్‌బై చెప్పగా.. నెక్ట్స్ సాయి తేజ్ కూడా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మెగా హీరోయిన్ నిహారిక ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సాయి తేజ్ సిద్ధమవుతున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీలో వరుస పెళ్లిళ్లకు రంగం సిద్ధమవుతోంది.

More News

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు గగనమేనా..?

దుబ్బాక అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఇప్పుడిప్పుడే తెరపడుతోంది. తాజాగా టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నామినేషన్ పర్వం.. మంటలు తెప్పించారు..

ఇవాళంతా నామినేషన్ పర్వం నడిచింది. అమ్మో చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఈ రేంజ్ హీట్ కనిపించదేమో అనిపించింది.

కాజల్‌ పెళ్లి చేసుకోబోయే బిజినెస్‌మేన్‌ ఎవరంటే?

దక్షిణాదిలో తెలుగు, తమిళ సినిమాలు సహా బాలీవుడ్‌లోనూ నటించిన హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది కాజల్‌ అగర్వాల్‌.

సరికొత్త పాత్రలో మాస్‌రాజా రవితేజ...!

మాస్‌ మహారాజాఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘క్రాక్’ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌ సినిమాలో నటించాల్సి ఉంది.

సంజయ్ దత్ తాజా పిక్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు చెందిన తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.