సాయిధరమ్ తేజ్ - వినాయక్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటెలిజెంట్'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పబ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈనెల 21తో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, వినీత్‌కుమార్, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి, తాగుబోతు రమేష్, భద్రం, నల్ల వేణు, రాహుల్ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్, సంధ్యా జనక్, ఫిష్ వెంకట్, శ్రీహర్ష, శివమ్ మల్హోత్రా, రవిరామ్ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: థమన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: వెంకట్, డాన్స్: శేఖర్, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com