శివగామితో సాయితేజ్ పోరు

  • IndiaGlitz, [Thursday,April 02 2020]

గత ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది.రీసెంట్గా దేవా కట్టా దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ర‌మ్య‌కృష్ణ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తుంటే.. విద్యావ్య‌వ‌స్థ‌లో త‌ప్పుల్ని ఎత్తి చూపించే విద్యార్థి నాయ‌కుడు పాత్ర‌లో సాయితేజ్ క‌న‌ప‌డ‌తాడ‌ట‌. త‌న పాత్ర పూర్తి ఇన్‌టెన్స్‌తో సాగుతుంద‌ని అంటున్నారు.

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. చిత్ర‌ల‌హ‌రి చిత్రం త‌ర్వాత సాయితేజ్‌, నివేదా పేతురాజ్ క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. అలాగే ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో రాశీఖ‌న్నా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత దేవా క‌ట్టా తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. పుల్లారావు, భ‌గ‌వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి సాయితేజ్ ఓకే చెప్పాడ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి.

More News

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న కోన‌!!

ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్ కోన వెంక‌ట్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారాయ‌న. కెరీర్ ప్రారంభంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా

బాహుబలి రికార్డ్‌లే కాదు..: ప్రభాస్‌పై మాజీ మంత్రి ప్రశంసలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు, నటీనటులు, వ్యాపారవేత్తలు

కరోనాపై పోరుకు విప్రో అధినేత భారీ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ చేయడం..

కరోనా సోకిందని వివక్ష చూపొద్దు.. ప్రేమ చూపండి : జగన్

తాడేపల్లి : కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు.

నిద్రపోయి పాపులర్ అయ్యాడు.. తీరా చూస్తే..!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఇందులో విచిత్రం ఏముంది..? అందరికీ నిద్రొస్తుంది.. నిద్రపోతారు కదా.. ఇందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా..?