సాయిధరమ్ తేజ్ హీరోగా 'తిక్క' చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్‌తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం తిక్క` జూలై 31న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సి.రోహిణ్ కుమార్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లారిస్సా బోనేసి హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ సినిమా తొలి సన్నివేశానికి అు్ల అరవింద్ క్లాప్ కొట్టగా, తెంగాణ మినిష్టర్ మహేందర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ లారిస్సా బోనేసి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, హీరో సునీల్, డైరెక్టర్ సునీల్ రెడ్డి, నవీన్ విజయ్‌కృష్ణ తదితయి పాల్గొన్నారు.
హీరో పేరు ఆదిత్య తను ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. హీరోయిన్ ను ప్రేమించి మధ్యలో బ్రేక్ అప్ అవుతాడు. మళ్లీ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేదే ఈ సినిమా. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10 నుండి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ లో సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఫిభ్రవరిలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది.
రాజేంద్రప్రసాద్, అలీ, రావురమేష్, పోసాని, తాగుబోతు రమేష్, అజయ్, వెన్నె కిషోర్, సత్య తదితయి ఇతర తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: విలియన్ ఓంగ్, డైలాగ్స్: క్ష్మీ భూపాల్, స్టోరీ: షేక్ దావూద్, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస, సినిమాటోగ్రఫీ: వి.ఎస్.జ్ఞానశేఖర్, మ్యూజిక్: ఎస్.ఎస్‌థమన్, కో ప్రొడ్యూసర్: కిరణ్ రాగినేని, నిర్మాత: సి.రోహిణ్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments