వాళ్లందరికీ థ్యాంక్స్ : ఎట్టకేలకు బయటకొచ్చి గుడ్‌న్యూస్ , సాయితేజ్ వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది రోడ్డు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇంటికే పరిమితమైపోయారు మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్‌కు హాజరవ్వడం తప్పించి.. బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సాయి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పట్లో తమ హీరో సినిమా చేస్తారా లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాయి థరమ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు.
తాజాగా విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని పేర్కొన్నారు. అయితే తేజూలో గతంలో మాదిరి ఉత్సాహం కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
కాగా .. గతేడాది వినాయక చవితి పండుగనాడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com