సాయిథరమ్ తేజ్ సుప్రీమ్ టీజర్ రివ్యూ..

  • IndiaGlitz, [Friday,January 01 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ టాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తుండ‌గా, హీరోయిన్ రాశీ ఖ‌న్నా పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తుంది.

నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా సుప్రీమ్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ టాక్సీని చాలా స్పీడుగా డ్రైవ్ చేస్తూ...మాస్ లుక్ లో క‌నిపించాడు. మెగాస్టార్ సుప్రీమ్ హీరో...అనే పాట ఎంత పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఈ ట్యూన్ తో రూపొందిన సుప్రీమ్ టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. మూడు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సుప్రీమ్ తాజా షెడ్యూల్ ఈనెల‌లో ప్రారంభం కానుంది. టీజ‌ర్ తో సినిమా పై ఆస‌క్తిని పెంచుతున్న సుప్రీమ్ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

More News

అబ్బాయితో అమ్మాయి మూవీ రివ్యూ

ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను ముడుపెడుతూ వచ్చిన సినిమాల్లో కొన్నే మనసుకు హత్తుకుంటాయి. నాగశౌర్య, పల్లాక్ లల్వాని నటించిన అటువంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అబ్బాయితో అమ్మాయి.

'గరం' పాటలకు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్

సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ,ముందుకు దూసుకెళుతున్న ఆది ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా చేసిన పూర్తి భిన్నమైన చిత్రం 'గరం'.

భారీ అంచ‌నాల‌ను పెంచిన బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

బాలీవుడ్ లో ఓకే బంగారం..

దుల్కర్ సల్మాన్,నిత్యామీనన్ జంటగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ఓకే కణ్మణి.ఈ చిత్రాన్ని తెలుగులో ఓకే బంగారం టైటిల్ తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

న్యూయ‌ర్ గిఫ్ట్ గా సుప్రీమ్ టీజ‌ర్

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.