సాయిథరమ్ తేజ్ సుప్రీమ్ టీజర్ రివ్యూ..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ టాక్సీ డ్రైవర్ గా నటిస్తుండగా, హీరోయిన్ రాశీ ఖన్నా పోలీసాఫీసర్ గా నటిస్తుంది.
నూతన సంవత్సర కానుకగా సుప్రీమ్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో హీరో సాయిధరమ్ తేజ్ టాక్సీని చాలా స్పీడుగా డ్రైవ్ చేస్తూ...మాస్ లుక్ లో కనిపించాడు. మెగాస్టార్ సుప్రీమ్ హీరో...అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ ట్యూన్ తో రూపొందిన సుప్రీమ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. మూడు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సుప్రీమ్ తాజా షెడ్యూల్ ఈనెలలో ప్రారంభం కానుంది. టీజర్ తో సినిమా పై ఆసక్తిని పెంచుతున్న సుప్రీమ్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com