తెలుగు »
Interviews »
కామెంట్ చేసే వాళ్లకు జోక్ లా అనిపించవచ్చు. కానీ...అలా చేయడం నాలో మరింత బాధ్యతను పెంచింది - సాయిధరమ్ తేజ్
కామెంట్ చేసే వాళ్లకు జోక్ లా అనిపించవచ్చు. కానీ...అలా చేయడం నాలో మరింత బాధ్యతను పెంచింది - సాయిధరమ్ తేజ్
Tuesday, May 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రేయ్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్..చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సుప్రీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 5న సుప్రీమ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తో ఇంటర్ వ్యూ మీకోసం....
సుప్రీమ్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..?
దిల్ రాజు గారు, అనిల్ ఈ చిత్రానికి సుప్రీమ్ అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది అని పెట్టారు. సుప్రీమ్ టైటిల్ పెట్టగానే ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు.ఈ టైటిల్ కన్ ఫర్మ్ అని తెలిసినప్పటి నుంచి సినిమా సక్సెస్ అవ్వాలని నా వంతుగా 100% హార్డ్ వర్క్ చేసాను. అందరి అంచనాలకు తగ్గట్టు సుప్రీమ్ మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత ఈ కథకి ఈ టైటిలే కరెక్ట్ అని
అందరూ చెబుతారని నా నమ్మకం.
సుప్రీమ్ కాన్సెప్ట్ ఏమిటి..?
ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు బాలు. క్యాబ్ డ్రైవర్ గా చేసాను. కథ గురించి చెప్పాలంటే.... క్యాబ్ డ్రైవర్ గా జర్నీ చేస్తుంటే...ఊహించని ప్రాబ్లమ్స్ రావడం...వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాను అనేది సుప్రీమ్ స్టోరి. అంతకు మించి ఎక్కువ చెప్పలేను. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా 6 నుంచి 65 సంవత్సరాల వయసు వాళ్లందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది.
హీరోయిన్ రాశీ ఖన్నా పోలీస్ క్యారెక్టర్ లో కామెడీ ఎలా చేసింది..?
కామెడీ సీన్స్ చేయడం చాలా కష్టం. కానీ..రాశీ ఖన్నా చాలా బాగా చేసింది. పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించింది. రాశీ ఖన్నా క్యారెక్టర్ 100% ప్రేక్షకులును నవ్విస్తుంది. సుప్రీమ్ రాశీ ఖన్నాకు మంచి పేరు తీసుకువస్తుంది.
పటాస్ తర్వాత అనిల్ రావిపూడి చేసిన చిత్రమిది. రెండవ సినిమా అంటే డైరెక్టర్ పై కాస్త ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ మీపై ఏమైనా పడిందా..?
అనిల్ కి సినిమా సంబంధించిన అన్ని విషయాలపై మంచి పట్టు ఉంది. అలాగే ఆయనకు ఆర్టిస్టుల నుంచి ఎలాంటి నటనను రాబట్టాలో..? ఆయనకు ఏం కావాలో బాగా తెలుసు. అందుచేత ఆయన ప్రెజర్ ఫీలవలేదు... నా పై ఎలాంటి ప్రెజర్ పడలేదు.
అందం హిందోళం..పాట రీమిక్స్ చేసారు కదా...ఈ పాటను రీమిక్స్ చేయడానికి కారణం ఏమిటి..?
ఈ సాంగ్ లో బ్రేక్ డ్యాన్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అప్పటి బ్రేక్ డ్యాన్స్ ని వెనక్కి తీసుకురావాలని ఈ పాటను రీమిక్స్ చేసాం. ఆ పాటకు ఇది ఒక ట్రిబ్యూట్ లాంటిది. చిరంజీవి గారు చేసిన ఆ పాట రేంజ్ లో కాకపోయినా...ఆ స్ధాయికి మ్యాచ్ అయ్యేలా ఈ రీమిక్స్ సాంగ్ చేసాం.
ఈ రీమిక్స్ సాంగ్ గురించి చిరంజీవి గార్కి చెప్పారా..? చెబితే ఏమన్నారు..?
చిరంజీవి గార్కి ఈ రీమిక్స్ సాంగ్ గురించి చెబితే...ఈ సాంగ్ చేసేది బయట వాళ్లు కాదు కదా...! నువ్వే కదా చేసేది.. అందులో తప్పు ఏం ఉంది.? బాగా చేయ్ అంటూ ప్రొత్సహించారు. ఆయన ఇచ్చిన ప్రొత్సాహంతో రెట్టించిన ఉత్సాహాంతో ఈ సాంగ్ చేసాను.
సుబ్రమణ్యం ఫర్ సేల్ లో గువ్వా గోరింక...సుప్రీమ్ లో అందం హిందోళం..సాంగ్స్ రీమిక్స్ చేయడంతో కొంత మంది తేజు... రీమిక్స్ రాజా అని కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు..?
కామెంట్ చేసే వాళ్లకు రీమిక్స్ రాజా అని కామెంట్ చేయడం జోక్ లా అనిపించవచ్చు. కానీ...రీమిక్స్ చేస్తున్నప్పుడు బాగా చేయాలని మరింత బాధ్యతతో చేస్తాను. అందుచేత రీమిక్స్ సాంగ్ చేయడం నాలో బాధ్యతను మరింత పెంచిందని చెప్పవచ్చు.
గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తో మీరు సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి...నిజమేనా..?
గ్యాండ్ లీడర్ అనే టైటిల్ తో నేను సినిమా చేయడం లేదు. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తో సినిమా చేయడానికి చరణ్ ఒక్కడికే అర్హత ఉంది.
చిరంజీవి గారి 150వ సినిమా రోజే...మీ చిత్రం కూడా ప్రారంభించారు..ఎలా ఫీలయ్యారు..?
ఆరోజు నా కొత్త సినిమా మలినేని గోపీచంద్ తో చేయనున్న సినిమా ప్రారంభించడం మాత్రమే కాదండీ...తిక్క సినిమా డబ్బింగ్ కూడా ఆరోజే ప్రారంభించాం. అలాగే సుప్రీమ్ సెన్సార్ కూడా ఆరోజే అయ్యింది. ఒకే రోజు నా మూడు సినిమాల కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని కలలో కూడా అనుకోలేదు. చాలా హ్యాఫీగా అనిపించింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తిక్క 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. మలినేని గోపీచంద్ తో చేస్తున్న చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. అలాగే బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments