ఈరోజు సెన్సార్ జరుపుకోనున్న తేజ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వులేని జీవితం` ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది. వెంటనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్` సినిమాలో నటించేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.
కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రెజీనా మరోసారి తేజ్ తో స్క్రీన్ పై కనపడనుంది. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్స్, ఆడియో పెద్ద హిట్టయిన నేపథ్యంలో సినిమా మరోసారి ఘనవిజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments