ఆ పాటలో సాయిధరమ్ తేజ్ స్టెప్స్ మెప్పిస్తాయా?
Send us your feedback to audioarticles@vaarta.com
వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా 'ఇంటెలిజెంట్'. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ స్వరాలను అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాటను రీమిక్స్ చేయనున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ రీమిక్స్ చేసే ఆలోచనని వినాయక్ ప్రతిపాదించారని ఇండస్ట్రీ సమాచారం. అన్నట్టుగానే...90వ దశకంలో విడుదలైన 'కొండవీటి దొంగ' సినిమాలోని "చమకు చమకు చామ్" పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లో ఇళయరాజా స్వరపరచిన ఈ పాటలో.. చిరంజీవి, విజయశాంతి తమ స్టెప్పులతో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు.
ఇప్పుడు ఈ పాటలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి సందడి చేయనున్నారు. ఇప్పటికే పాట చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిసింది. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ మంచి ఈజ్‌తో స్టెప్పులు వేసారని, ఆయన డాన్స్ మూమెంట్స్ బాగా వచ్చాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా.. ఈ సినిమాలో ఈ పాటే హైలైట్ గా నిలవనుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. సాయిధరమ్ తేజ్ స్టెప్స్ చూడాలంటే.. ఫిబ్రవరి 9 వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com