న‌వ‌ర‌సాలు ఉన్న‌ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ : సాయిథ‌ర‌మ్ తేజ్

  • IndiaGlitz, [Wednesday,September 23 2015]

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో యూత్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 24న సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ గురించి హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ఇంట‌ర్ వ్యూ మీకోసం...

సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా ఏ త‌ర‌హా చిత్రం..?

దిల్ రాజు గారు సినిమా అంటే ఫ్యామిలీ అంతా క‌ల‌సి చూసేలా ఉంటుంద‌నేది అంద‌రికి తెలిసిందే. అలాగే హారీష్ శంక‌ర్ సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ గా ఉంటుంది. వీళ్లిద్ద‌రు క‌లిసి చేసిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లో...ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉంటూనే హారీష్ శంక‌ర్ సినిమాలో ఉండే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే న‌వ‌ర‌సాలు ఉన్న‌ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్.

సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది..?

విదేశాల్లో చ‌దువుకునే యువ‌కులు...ఓ వైపు చ‌దువుకుంటునే..మ‌రో వైపు డ‌బ్బు కోసం పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. అలా డ‌బ్బు కోసం ఏదైనా చేసే పాత్ర పోషిస్తున్నాను. ప్ర‌తి నిమిషాన్ని డాల‌ర్ గా మార్చుకుని డ‌బ్బు సంపాదించి ఇండియాకి వెళ్లి కాల‌ర్ ఎగ‌రేయాలి అనుకుంటాను. ఎందుకు డ‌బ్బులు సంపాదించాల‌నుకుంటున్నాను. డ‌బ్బులు సంపాదించ‌డం కోసం నేను ఏం చేసాను. ఈవిధంగా నా పాత్ర ఉంటుంది

హీరోయిన్ రెజీనా పాత్ర ఎలా ఉంటుంది.?

రెజీనా పాత్ర పేరు సీత.నాకు అంతా తెలుసు న‌న్ను ఎవ‌రు మోసం చేయ‌లేరు అనుకునే అమాయ‌కురాలి పాత్ర పోషించింది.

చిరంజీవి గారు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆడియో ఫంక్ష‌న్ లో...మొగుడు కావాలి, బావ‌గారు బాగున్నారా...చిత్రాల త‌ర‌హాలో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా ఉంటుంద‌ని చెప్పారు. ఆ రెండు చిత్రాల‌నే ఉంటుందా..సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్..?

మొగుడు కావాలి, బావ‌గారు బాగున్నారా...సినిమాలో ఒక‌టి..రెండు సీన్స్ ఇన్ స్పిరేష‌న్ తీసుకుని ఉండొచ్చు కానీ..మొత్తం సినిమా ఆ రెండు చిత్రాల ఉండ‌దు.

నాగ‌బాబు గారితో ఫ‌స్ట్ టైం న‌టించిన‌ట్టున్నారు..

అవును...నాగ‌బాబు గారితో క‌ల‌సి ఫ‌స్ట్ టైం న‌టించాను. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి..నాగ‌బాబు గారితో క‌ల‌సి ఓ సీన్ చేయాలి. అప్ప‌టి వ‌ర‌కు బాగానే చేసాను. కానీ ఆయ‌న రావ‌డం చూసి సీన్ చేయ‌లేక‌పోయాను. చాలా టేక్స్ తీసుకున్నాను. అప్పుడు నాగ‌బాబు మావ‌య్య వ‌చ్చి ఏమైంది రా ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే చేసావట క‌దా... అంటే మీ ముందు చేయ‌లేక‌పోతున్నాను అని చెప్పాను. నువ్వు చేయ‌గ‌ల‌వ్ అంటూ ఎంక‌రేజ్ చేయ‌డంతో ఆత‌ర్వాత ఆ సీన్ చేయ‌గ‌లిగాను. ఇదో మెమ‌ర‌బుల్ ఎక్స్ పీరియ‌న్స్ .

హారీష్ శంక‌ర్ సినిమా అంటే పంచ్ డైలాగ్స్ ఉంటాయి. మ‌రి..సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లో డైలాగ్స్ ఎలా ఉంటాయి..?

ఈ సినిమాలో కూడా పంచ్ డైలాగ్స్ ఉంటాయి. కాక‌పోతే కావాల‌ని పంచ్ డైలాగ్స్ పెట్టిన‌ట్టు కాకుండా సిట్యూవేష‌న్ త‌గ్గ‌ట్టుగా డైలాగ్స్ ఉంటాయి.

మీరు, హారీష్ శంక‌ర్..మాస్ అనుకుంటే మీకు...మ్యూజిక్ డైరెక్ట‌ర్ మిక్కీ జే మేయ‌ర్ ఎలా సూట్ అవుతార‌నుకున్నారు..?

ముకుంద సినిమాలో గోపిక‌మ్మా...సాంగ్ చూసాకా..ఈ సినిమాకి మిక్కీ జే మేయ‌రే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని హారీష్ అన్న ఫిక్స్ అయ్యారు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సాంగ్స్ విన్నాకా...మిక్కీ జే మేయ‌రే ఇచ్చాడా మ్యూజిక్ లేక ఎవ‌రితోనైనా చేయించారా అనిపించింది. అన్ని పాట‌లు ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉన్నాయి. మిక్కీతో చేయించుకుంటే అన్నిర‌కాల పాట‌లు అందించ‌గ‌ల‌డు అనిపించింది.

గువ్వా గోరింక‌తో...అనే రీమిక్స్ సాంగ్ సినిమాకి ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంది..?

ఈ పాటని రీమిక్స్ చేద్దామ‌నుకున్న‌ప్ప‌టి నుంచి బాగా చేయాల‌ని చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సినిమాకి ఈ పాట ఖ‌చ్చితంగా ప్ల‌స్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. కానీ ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంద‌నేది చెప్ప‌లేను.

రీమిక్స్ చేయ‌డం గురించి మీ అభిప్రాయం ఏమిటి..?

చిరంజీవిగారు, క‌ళ్యాణ్ మావ‌య్య‌, సీనియ‌ర్ హీరోస్ బాల‌క్రిష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌...వీళ్ల మూవీస్ రీమేడ్ చేయాలంటే గ‌ట్స్ కావాలి. వాళ్ళ స్టాండ‌ర్ట్స్ అందుకోవాలంటే క‌ష్టం. అందుచేత రీమిక్స్ & రీమేడ్ కి సాధ్య‌మైనంత దూరంగా ఉంటేనే మంచిది.

చిరంజీవి గారి సినిమాకి సీక్వెల్ చేసే అవ‌కాశం వ‌స్తే..ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు..?

నాకు చంట‌బ్బాయి సినిమా చాలా ఇష్టం. కనుక సీక్వెల్ చేసే ఛాన్స్ వ‌స్తే చంట‌బ్బాయి మూవీ సీక్వెల్ చేస్తాను.

మీరు న‌టిస్తుంటే..మీలో కొంత‌మందికి చిరంజీవిగార్ని , మ‌రి కొంత‌మందికి క‌ళ్యాణ్ గార్ని చూసిన‌ట్టు అనిపిస్తుంది. మీకు ఏమినిపిస్తుంది..?

నాకు కొన్ని సీన్స్ లో క‌ళ్యాణ్ మావ‌య్య లా చేసాను అనిపిస్తుంది. నేను చేసిన సాంగ్స్ ,కామెడీ సీన్స్ చూస్తే... చిరంజీవి గారిలా చేసాను అనిపిస్తుంది. ఒక‌టో రెండో సీన్స్ లో నాగ‌బాబు గారిలా చేసాన‌నిపిస్తుంది. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి వాళ్ల‌ను చూస్తూ పెరిగిన‌వాడిని. క‌నుక వాళ్ల‌ను ఇమిటేట్ చేయ‌కూడ‌దు అనుకున్నా...అది అలా వ‌చ్చేస్తుంది. అయినా..నేను న‌టిస్తుంటే మావ‌య్య‌ గుర్తుకు వ‌స్తున్నారంటే హ్యాపీగా ఫీల‌వుతుంటాను.

మెగా ఫ్యామిలీలో మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎవ‌రెవ‌రు చేస్తే బాగుంటుంది..?

చిరంజీవి, క‌ళ్యాణ్ మావ‌య్య‌, చ‌ర‌ణ్ క‌ల‌సి మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌ని కోరుకుంటున్నాను. అందులో . నేను, బ‌న్ని, వ‌రుణ్ తేజ్..గెస్ట్ రోల్స్ చేస్తే బాగుంటుంద‌నేది నా ఫీలింగ్.

మీలో మీకు న‌చ్చేది ఏమిటి..?

కామెడీ, ఫైట్స్, సాంగ్స్.. చేయ‌డం నాకు ఇష్టం. రొమాన్స్ చేయ‌డం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

వ‌రుస‌గా దిల్ రాజు బ్యాన‌ర్ లోనే సినిమాలు చేస్తున్నారు..? ప‌్ర‌త్యేక కార‌ణం ఏమైనా ఉందా..?

ప్ర‌త్యేక కార‌ణం అంటూ ఏమీ లేదు. మంచి క‌థ‌లు చెబుతున్నారు. మంచి రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారు. అలాంటప్పుడు వ‌రుస‌గా దిల్ రాజు గారికి సినిమాలు చేస్తే త‌ప్పేంటి.

ఒకే సంస్థ‌కు వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్..?

చిరంజీవి గారికి క్రాంతి కుమార్ గారు చాలా స‌పోర్ట్ గా ఉండేవారు. నాకు ఆయ‌న‌లా...దిల్ రాజు గారు స‌పోర్ట్ గా నిలిచారు. నాతో దిల్ రాజు గారు కంటిన్యూస్ గా సినిమాలు చేయ‌డం అంటే అంత‌కు మించి అద్రుష్టం ఏమి ఉంటుంది.

మీ త‌దుప‌రి చిత్రాల గురించి..?

తిక్క, సుప్రీమ్ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు సినిమాలు త‌ర్వాత దిల్ రాజు గారి బ్యాన‌ర్ లో శ‌త‌మానంభ‌వ‌తి అనే సినిమా చేస్తున్నాను . ఈ చిత్రానికి వేగేశ్న స‌తీష్ డైరెక్ట‌ర్.

More News

స్టార్స్ చిత్రాలకు మొండి చెయ్యి

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ పెద్ద తారాగణం, పెద్ద పెద్ద డైరెక్ట‌ర్స్‌తో రూపొందిన చిత్రాలు 'బాహుబ‌లి', 'శ్రీమంతుడు' బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని క‌లెక్ష‌న్స్‌ను సాధించి మేం టాప్ అన్నారు.

చిరు150వ సినిమా టీజర్...

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చిరు 150వ సినిమా ప్రారంభం కావాలి.

'చంద్రిక' ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ : కథానాయికలు కామ్న & శ్రీముఖి

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆశ నిర్మిస్తున్న చిత్రం "చంద్రిక". హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో కామ్నజెత్మలాని, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'సుప్రీమ్ ' ప్రారంభం

‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం 21 చిత్రం ‘సుప్రీమ్’

బ్రహ్మీ కంటే జెపి పాత్ర హైలైట్ గా ఉంటుందట

శ్రీనువైట్ల సినిమా అంటే బ్రహ్మానందం కోసం ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్ చేస్తూ సాగే పాత్రగా ఉంటుంది.