మావయ్యలు నాకు దేవుళ్లు - సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తన మేనమామ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. `విన్నర్` గురించి మాట్లాడుతూ మధ్యలో విలేకరుల అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన చిరంజీవి గురించి చెప్పారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ``ఖైదీని నేను నాలుగైదు సార్లు చూసి ఉంటాను. కానీ ఆ తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలను చాలా సార్లు చూశాను.
ఈ మధ్య విడుదలైన ఖైదీ నెం.150ని మూడు సార్లు చూశాను. తొలి సారి నేను వెన్నెల కిశోర్, సత్య కలిసి థియేటర్లలో చూశాను. ఈ సినిమాలో రత్తాలు రత్తాలుకి డ్యాన్స్ చేశాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు కూడా డ్యాన్సులు చేశా. ఆయన్ని స్క్రీన్ మీద చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. అంత బాగా ఉంటారు. బాగా పెర్ఫార్మ్ చేయాలి, జనాలని ఎంటర్‌టైన్ చేయాలి అని కసి ఉంటుంది. ఆయన వయసు గురించి ఆలోచించే అర్హత కూడా నాకు లేదు. ఆయన ఇంకా బిలో 50లాగానే కనిపిస్తారు. మాలాంటి యంగ్స్టర్స్ కి చిరంజీవిగారు స్ఫూర్తి. ఇప్పటికి ఆయన అలాగే కష్టపడుతున్నారు. అది మామూలు విషయం కాదు. ఎంత ఎదిగినా గురువు దగ్గర ఎలా బిహేవ్ చేయాలో ఇప్పటికీ అలాగే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు దేవుడు. మా ముగ్గురు మావయ్యలు నాకు దేవుళ్లు`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments