మావయ్యలు నాకు దేవుళ్లు - సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Tuesday,February 28 2017]

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌న మేన‌మామ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. 'విన్న‌ర్' గురించి మాట్లాడుతూ మ‌ధ్య‌లో విలేక‌రుల అడిగిన ప్ర‌శ్న‌కు జ‌వాబుగా ఆయ‌న చిరంజీవి గురించి చెప్పారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ ''ఖైదీని నేను నాలుగైదు సార్లు చూసి ఉంటాను. కానీ ఆ త‌ర్వాత జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి, ఘ‌రానా మొగుడు, గ్యాంగ్ లీడ‌ర్ వంటి సినిమాల‌ను చాలా సార్లు చూశాను.

ఈ మ‌ధ్య విడుద‌లైన ఖైదీ నెం.150ని మూడు సార్లు చూశాను. తొలి సారి నేను వెన్నెల కిశోర్‌, స‌త్య క‌లిసి థియేట‌ర్ల‌లో చూశాను. ఈ సినిమాలో ర‌త్తాలు ర‌త్తాలుకి డ్యాన్స్ చేశాను. అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు కూడా డ్యాన్సులు చేశా. ఆయ‌న్ని స్క్రీన్ మీద చూడ‌గానే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. అంత బాగా ఉంటారు. బాగా పెర్ఫార్మ్ చేయాలి, జ‌నాల‌ని ఎంట‌ర్‌టైన్ చేయాలి అని క‌సి ఉంటుంది. ఆయ‌న వ‌య‌సు గురించి ఆలోచించే అర్హ‌త కూడా నాకు లేదు. ఆయ‌న ఇంకా బిలో 50లాగానే క‌నిపిస్తారు. మాలాంటి యంగ్స్ట‌ర్స్ కి చిరంజీవిగారు స్ఫూర్తి. ఇప్ప‌టికి ఆయ‌న అలాగే క‌ష్ట‌ప‌డుతున్నారు. అది మామూలు విష‌యం కాదు. ఎంత ఎదిగినా గురువు ద‌గ్గ‌ర ఎలా బిహేవ్ చేయాలో ఇప్ప‌టికీ అలాగే ఉంటారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే నాకు దేవుడు. మా ముగ్గురు మావ‌య్య‌లు నాకు దేవుళ్లు'' అని అన్నారు.

More News

'వెంకటాపురం' ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్&తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.

సంగీత దర్శకుడు థమన్ చేతుల మీదుగా 'మెట్రో' మదర్ సెంటిమెంట్ సాంగ్ లాంఛ్

ఆర్ 4ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`,`జర్నీ`,`పిజ్జా`వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణ లో

హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...' ద్వితీయ ప్రచార చిత్రం, పాట విడుదల

ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రమిది.ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి నరసారావు పేటలో జరిగింది.

దేవిశ్రీ ప్రసాద్ గురుస్మరణ

మాతృదేవోభవ,పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అనే నేర్పించారు.దేవిశ్రీ ప్రసాద్ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ మాటలను అసలు మర్చిపోలేదు.

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్,భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో