వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంబంధించి బుధవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా చిత్రయూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చే నిజాయితీ గల అధికారిగా కనిపించనున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేయాలి... ఎలా పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం అనే విషయాలపై లోతుగా చర్చించినట్టు ట్రైలర్‌లోనే తెలుస్తోంది. కలెక్టర్‌గా తన విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, రాజకీయ శక్తుల ఒత్తిడి ఇవే ఈ కథకు మూలాలు. సీరియస్‌గా సాగిన ట్రైలర్‌లో.. తన ఎమోషన్ ఏమిటో చెప్పేశాడు దేవాకట్టా. ముఖ్యంగా ఆయన తన పెన్ పవర్ మరోసారి చూపించాడు.
”సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు
పట్టపగలే బాహాటంగా ప్రజల ప్రాణాలు తీస్తుంటే
కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్”
”మీ భయం అజ్ఞానం అమాయకత్వం విశ్వాసమే
ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు”
”అజ్ఞానం గూడు కట్టిన చోటే
మోసం గుడ్లు పెడుతుంది…”
వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుండనున్నాయి.
ఇకపోతే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయమై చిరు స్పందిస్తూ… తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష..అంటూ పేర్కొన్నారు చిరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments