'రిపబ్లిక్' మూవీ కాదు, మూమెంట్... 'జీ 5'లో సినిమాను ఉద్యమంలా వీక్షించిన ప్రజలు

  • IndiaGlitz, [Monday,December 06 2021]

ప్రేక్షకులకు కేవలం వినోదం అందించడం మాత్రమే తమ బాధ్యత అని 'జీ 5' అనుకోవడం లేదు. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ప్రజల్ని చైతన్యం చేసే సినిమాలనూ అందిస్తోంది. 'రిపబ్లిక్' వంటి సినిమాలకు అండగా ఉంటోంది. 'జీ 5' అంటే 'వినోదం మాత్రమే కాదు, అంతకు మించి' అనే పేరు తెచ్చుకుంటోంది.

సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? వంటివి చెబుతూ... సామాజిక బాధ్యతతో రూపొందిన చిత్రమిది. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, 'జీ 5' ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూశారు. 'రిపబ్లిక్' ఓ సినిమా కాదని, ఉద్యమం ('రిపబ్లిక్' మూవీ కాదు, మూమెంట్) అని అంటున్నారు.

నవంబర్ 26న 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన 'జీ 5' బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. 'జీ 5'లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారు. ఇదొక రికార్డు. సాయి తేజ్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అయ్యింది. సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా కూడా 'జీ 5' ఓటీటీలో విడుదలైంది.

More News

భారతీయుడు 2: కాజల్ ప్లేస్‌లో తమన్నా.. రూమర్స్‌కి త్వరలోనే క్లారిటీ..!!

తమిళ దర్శక దిగ్గజం శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘‘ఇండియన్ 2’’

'రామారావు ఆన్ డ్యూటీ' టైం ఫిక్స్ .. ఆర్డర్స్ రిలీజ్ చేసిన మేకర్స్..!!

క్రాక్ హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూకుడు మీదున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ ఎలిమినేషన్‌.. మానస్‌ని హగ్ చేసుకొని వీడ్కోలు, హౌస్‌మేట్స్ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగులో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అందరూ ఊహించినట్లుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడంతో హౌస్ మేట్స్ షాకయ్యారు.

చాపకింద నీరులా ఒమిక్రాన్‌ .. మహారాష్ట్రలో ఒకేసారి 7 కేసులు, భారత్‌లో 12కి చేరిన సంఖ్య

అనుకున్నదంతా అయ్యింది. నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తోన్నదే జరుగుతోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది.

అఖండ సినిమా ఆడుతున్న థియేటర్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.