లవ్యూ పవన్ కల్యాణ్ మామా..: సాయి తేజ్

  • IndiaGlitz, [Monday,January 13 2020]

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతీ తెరకెక్కించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సంపాదించుకోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగానూ బాగానే దూసుకెళ్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వరుస పరాజయాలతో నిరాశకు లోనైన సాయితేజ్ కు ‘చిత్రలహరి’ విజయంతో మళ్లీ ఊపొచ్చిందని చెప్పుకోవచ్చు.

‘ప్రతిరోజు పండగే’ సినామా మెగాభిమానులనే కాకుండా సినీ ప్రియులను.. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి భారీ స్పందన అందుకుంది. ఈ క్రమంలో పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సాయితేజ్‌కు పవన్ నుంచి స్పెషల్ మెసేజ్‌తో పాటు పుష్పగుచ్ఛం వచ్చింది.

పవన్: ‘ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని సందేశం పంపారు.

సాయితేజ్: ‘మీ స్పందనపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుంది. లవ్యూ పవన్ కల్యాణ్ మామా’ అంటూ తన హర్షం వెలిబుచ్చాడు. కాగా.. మేనమామ పంపిన సందేశాన్ని సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

More News

మ‌రో కొరియ‌న్ రీమేక్‌పై క‌న్నేసిన అగ్ర నిర్మాత‌

వంద సినిమాల‌కు పైగా నిర్మించి భార‌త‌దేశంలోని అన్నీ భాష‌ల్లో సినిమాల‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌.

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ - అల్లు అర్జున్

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది..

బంధుప్రీతిపై బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన `అల‌..వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి సంద‌ర్భంగా

కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!?

ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆ చానెల్‌కు చైర్మన్‌గా ఉన్న థర్టీ ఇయర్స్ పృథ్వీ సరస సంభాషణ జరపడంతో ఆ వ్యవహారం చివరికి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.