లవ్యూ పవన్ కల్యాణ్ మామా..: సాయి తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతీ తెరకెక్కించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సంపాదించుకోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగానూ బాగానే దూసుకెళ్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వరుస పరాజయాలతో నిరాశకు లోనైన సాయితేజ్ కు ‘చిత్రలహరి’ విజయంతో మళ్లీ ఊపొచ్చిందని చెప్పుకోవచ్చు.
‘ప్రతిరోజు పండగే’ సినామా మెగాభిమానులనే కాకుండా సినీ ప్రియులను.. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచి భారీ స్పందన అందుకుంది. ఈ క్రమంలో పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సాయితేజ్‌కు పవన్ నుంచి స్పెషల్ మెసేజ్‌తో పాటు పుష్పగుచ్ఛం వచ్చింది.
పవన్: ‘ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని సందేశం పంపారు.
సాయితేజ్: ‘మీ స్పందనపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుంది. లవ్యూ పవన్ కల్యాణ్ మామా’ అంటూ తన హర్షం వెలిబుచ్చాడు. కాగా.. మేనమామ పంపిన సందేశాన్ని సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
Falling short of words...and thank you seems to be too small of a word right now...love you @PawanKalyan mama ❤️???? #prathirojupandaage pic.twitter.com/CxrQbMDodm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 13, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com