'టిక్ టిక్ టిక్' ట్రైలర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో పద్మావతి చదలవాడ నిర్మాతగా వస్తోన్న చిత్రం `టిక్ టిక్ టిక్`. ఇండియన్ సినిమా చరిత్రంలో తొలి అంతరిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం.త్వరలోనే సినిమా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా....
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ``టిక్ టిక్ టిక్` సినిమా ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి స్పేస్ కాన్సెప్ట్ సినిమాను దక్షిణాదిన నిర్మించడం చాలా గొప్ప విషయం. తమిళంలో ట్రైలర్ చూసిన నేను, దీన్ని తెలుగులో ఎవరు విడుదల చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూశాను. అయితే నా మిత్రుడు లక్ష్మణ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకుని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. జయం రవి సహా చిత్రయూనిట్‌కి, సాంకేతిక నిపుణులు, గ్రాఫిక్స్ టీంకి కంగ్రాట్స్. మంచి కంటెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మన సినిమాల్లోని రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న `టిక్ టిక్ టిక్` సినిమా తెలుగులో తప్పకుండా పెద్ద సక్సెస్‌ను సాధిస్తుంది`` అన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ - ``మా `టిక్ టిక్ టిక్` సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్‌కి థాంక్స్. తెలుగులో ఈ సినిమాను మా బ్యానర్లో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. `బిచ్చగాడు` సినిమాను తెలుగులో విడుదల చేసినప్పుడు ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. తర్వాత మా బ్యానర్లో చేసిన థ్రిల్లర్ మూవీ `16`ని కూడా ఆదరించారు. అలాంటి విలక్షణమైన సబ్జెక్ట్ ఇది. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అల్రెడి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌ను, సినిమాను ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తున్నాం`` అన్నారు.
జయం రవి, నివేదా పేతురాజ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా : వెంకటేష్, ఎడిటర్: ప్రదీప్, ఆర్ట్: మూర్తి, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments