రాజస్ధాన్ లో తేజు, రాశి..
Send us your feedback to audioarticles@vaarta.com
రాజస్ధాన్ లో తేజు, రాశి ఖన్నా...ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? సుప్రీమ్ సినిమా కోసం సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిథరమ్ తేజ్ టాక్సీ డ్రైవర్ గా నటిస్తుండగా, రాశీ ఖన్నా పోలీసాఫీసర్ గా నటిస్తుంది. సుప్రీమ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్ రాజస్ధాన్ లో జరుపుకుంటుంది. తేజు, రాశి ఖన్నా లపై వచ్చే రొమాంటిక్ సాంగ్ ను రాజస్టాన్ లోని జైసల్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. పటాస్ తో సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి సుప్రీమ్ తో కూడా సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. మరి...సుప్రీమ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments