తేజ్ మూవీకి ముహుర్తం కుదిరింది...
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లానువ్వు లేని జీవితం` వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది పటాస్` వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సుప్రీమ్ టైటిల్ అయితే డోంట్ సౌండ్ హార్న్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి ముహుర్తం ఫిక్సయింది. సెప్టెంబర్ 23న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, పోసాని, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, రచనా సహకారం: ఎస్.కృష్ణ, ఫైట్స్: వెంకట్, సహ నిర్మాతలు: శిరీష్ , లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments