తేజ్ మూవీకి ముహుర్తం కుదిరింది...

  • IndiaGlitz, [Monday,September 21 2015]

పిల్లానువ్వు లేని జీవితం' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది పటాస్' వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సుప్రీమ్ టైటిల్ అయితే డోంట్ సౌండ్ హార్న్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి ముహుర్తం ఫిక్సయింది. సెప్టెంబర్ 23న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, పోసాని, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, రచనా సహకారం: ఎస్.కృష్ణ, ఫైట్స్: వెంకట్, సహ నిర్మాతలు: శిరీష్ , లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.

More News

అఖిల్ మూవీ కథేంటి...?

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న నాగార్జున మరో వారసుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఫస్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విషయం తెలిసిందే.

అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న సాయిథ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

25న వస్తున్న 'చంద్రిక'

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై..యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్‘చంద్రిక’.

సాయిథ‌ర‌మ్ తేజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని హారీష్ శంక‌ర్ తెర‌కెక్కించారు.

దీపావళికి నిఖిల్ 'శంకరాభరణం'

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'శంకరాభరణం'.