ఆ దర్శకుడితో సాయిధరమ్ మళ్లీ సినిమా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరోల్లో ఒకడు సాయిధరమ్ తేజ్. ఈ యువ కథానాయకుడు నటించిన 'జవాన్' డిసెంబర్ 1న విడుదలవుతుంది. మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వైష్ణో కృష్ణ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ ఇదే నిర్మాతతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు దర్శకుడెవరో కాదు..హరీష్ శంకర్. గతంలో సాయిధరమ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
]ఆ సినిమా తర్వాత మళ్లీ సాయిధరమ్, హరీష్ శంకర్ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఏమౌతుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments