జూన్ నుంచి సాయిధరమ్ తేజ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌కు.. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్ చిత్రాల పరాజయాలు స్పీడ్ బ్రేక్ వేశాయి. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ మెగా వారి కథానాయకుడు.
ప్రస్తుతం యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నారు సాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా.. జూన్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆ సినిమా విడుదలయ్యే నాటికి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో తను చేయబోయే సినిమాని పట్టాలెక్కించనున్నారు సాయిధరమ్. తాజా సమాచారం ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాని జూన్‌లో సెట్స్ పైకి తీసుకెళ్ళి.. ఏడాది చివరిలో విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఈ చిత్రాలతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనూ సాయిధరమ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com