సాయిధరమ్ తేజ్ , కరుణాకరన్ మూవీ అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
తన తొలి సినిమా తొలిప్రేమ`తో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గుర్తుండిపోయే చిత్రం అందించారు దర్శకుడు కరుణాకరన్. ఇప్పుడు తొలిసారిగా సాయిధరమ్ తేజ్ ను డైరెక్ట్ చేస్తున్నారు కరుణాకరన్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ మొదటిసారిగా సాయిధరమ్ సరసన నటించనుంది. ఈ లవ్ స్టొరీని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది.
గోపిసుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో తొలిసారిగా నటించిన అల్లు అర్జున్ కూడా హ్యాపీ` సినిమాతో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్నారు. ఇలా తొలిసారి డైరెక్ట్ చేసిన ఇద్దరు మెగా హీరోలకి ఈ దర్శకుడు విజయాలను అందించారు. ఇప్పుడు సాయి విషయంలో కూడా అది మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఇదిలా వుంటే...వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్` మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com