సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్ చిత్రం టైటిల్ ఏంటంటే..

  • IndiaGlitz, [Monday,March 12 2018]

మెగాహీరో సాయిధరమ్ తేజ్, కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేష‌న్‌లో 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సంస్థగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయ‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తో తొలిసారిగా ఈ సినిమాని నిర్మిస్తుండ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 'దేవుడు వరమందిస్తే' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం జూన్ 14న‌ విడుదల కానుంద‌ని సమాచారం.

More News

వెంక‌టేష్‌.. ది గ్రేట్ ఫాద‌ర్

విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది.

'ఆఖరి పోరాటం'కి 30 ఏళ్ళు

అతిలోకసుందరి శ్రీదేవిని హీరో స్థాయిలో చూపించిన చిత్రం 'ఆఖరి పోరాటం'. సిబిఐ ఆఫీస‌ర్ ప్రవల్లిక (శ్రీదేవి).. పేరుబడ్డ నేరస్థుడు అనంతానంత స్వామి (అమ్రీష్ పూరి)ని ఎలా పట్టుకుంది? దానికి స్టేజి ఆర్టిస్ట్ అయిన విహారి (నాగార్జున) ఎలా సాయపడ్డాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఎ.ఎన్‌.ఆర్ పాత్ర‌లో...

స్వ‌ర్గీయ ఎ.ఎన్‌.ఆర్ పాత్ర‌లో ఆయ‌న మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య న‌టించ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే..సావిత్రి బ‌యోపిక్ 'మ‌హాన‌టి'లో అల‌నాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ పాత్ర‌ధారుల కోసం యూనిట స‌భ్యులు ముందుగా ఎన్టీఆర్ మ‌న‌వ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు చైత‌న్య‌ను సంప్ర‌దిస్తే వారు కాద‌ని అన్నారు.

గాయ‌నిగా మారిన మరో న‌టి...

1921 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొగ‌స‌రి ఆదా శర్మ‌. తెలుగులో హార్ట్ ఏటాక్ సినిమాలో కూడా న‌టించింది.

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం...

ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం రోజు రోజుకూ తన సేవా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. మనసున్న ఎంతో మంది మనం సైతంలో భాగమవుతున్నారు.