సాయిధరమ్, కరుణాకరన్ ఫిల్మ్ ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
20 ఏళ్ల క్రితం విడుదలైన తొలి ప్రేమ చిత్రంతో.. ప్రేమకథా చిత్రాల పరంగా ఓ ట్రెండ్ సృష్టించారు దర్శకుడు ఎ.కరుణాకరన్. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. తన ప్రతి చిత్రంతోనూ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్. చిరు విరామం తరువాత ఆయన మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మెలోడీల స్పెషలిస్ట్ అయిన గోపీసుందర్ స్వరాలను అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి జూన్ 14ని విడుదల తేదిగా ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. సుప్రీమ్ తరువాత సరైన విజయం లేని సాయిధరమ్‌కు, డార్లింగ్ తరువాత సరైన హిట్ లేని కరుణాకరన్‌కు ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com