సాయిధరమ్ తేజ్, ఎ.కరుణాకరన్ కాంబినేషన్ లో కె.ఎస్.రామారావు భారీ చిత్రం ప్రారంభం
- IndiaGlitz, [Wednesday,August 16 2017]
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ప్రొడక్షన్ నెం.45గా నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఆగస్ట్ 16న హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో సాయిధరమ్‌తేజ్, దర్శకుడు ఎ.కరుణాకరన్, సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ, మాటల రచయిత డార్లింగ్ స్వామి, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత కె.ఎస్.రామారావు పాల్గొన్నారు.
నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - ''మా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈరోజు మా సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. మా డైరెక్టర్‌గారు మ్యూజిక్ సిట్టింగ్స్‌లో వున్నారు. డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామని చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. ఈరోజు ఉదయం 8.20 గంటలకు మా చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. మా హీరో సాయిధరమ్ తేజ్‌తో సినిమా చెయ్యడం అంటే మా కుటుంబంలో ఒక యంగ్‌స్టర్‌తో చేస్తున్న ఫీలింగ్ నాకు వుంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి సాయిధరమ్‌తేజ్ కృషి ఎక్కువగా వుంది. ఇంతకుముందు మా బేనర్‌లో వాసు చిత్రాన్ని చేసిన రుణాకరన్‌గారు చెప్పిన సబ్జెక్ట్ తేజుకి నచ్చి ఈ సినిమా రామారావుగారైతే బాగా చేస్తారని నన్ను పిలిచి మీ డైరెక్టర్‌గారితో మీరు మంచి సినిమా తియ్యండి అని మంచి స్క్రిప్ట్‌ని నాకు అందించినందుకు మా హీరో సాయిధరమ్‌తేజ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా డైరెక్టర్‌గారు కళ్యాణ్‌బాబుతో చేసిన సినిమాలైనా, ఎవరితో చేసిన సినిమాలైనా పవిత్రమైన ప్రేమ, సిన్సియర్ ప్రేమ వున్న మంచి సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి ప్రేమతో నిండి వుంటాయి.
అటువంటి మా కరుణాకరన్‌గారితో మళ్ళీ ఓ మంచి లవ్‌స్టోరీ, మ్యూజికల్ హిట్‌తో మీ ముందుకు వస్తున్నందుకు ఎంతో ధైర్యంగానూ, మరెంతో నమ్మకంగానూ వుంది. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. డైరెక్టర్‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో గోపీసుందర్‌గారు రెండు అద్భుతమైన ట్యూన్స్ చేశారు. మా డైరెక్టర్‌గారు చాలా మంచి సినిమా తీసి ఇస్తారన్న నమ్మకం నాకు వుంది. ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చే స్తోమత, దమ్ము, ధైర్యం వున్న ప్రొడ్యూసర్‌ని కాబట్టి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. మా డైరెక్టర్‌గారికి చాలా ఇష్టమైన ఆండ్రూస్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామితో కరుణాకరన్ చాలా సినిమా చేశారు. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ - ''తేజుతో సినిమా చేస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. ఇది పూర్తిగా లవ్‌స్టోరీ. కలర్‌ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జాలీగా వుండే సినిమా ఇది'' అన్నారు.
హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ - ''సంవత్సరం నుంచి రామారావుగారు, నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్నాం. కానీ, కథ సెట్ అవ్వలేదు. ఎవరి దగ్గరకి ఏ కథ వెళ్ళాలనేది ముందే రాసి పెట్టి వుంటుందని చాలా మంది చెప్పారు. అలా కరుణాకరన్‌గారి కథ నాకు రాసి పెట్టి వుందని నేను అనుకోలేదు. కానీ, అలా కుదిరింది. కరుణాకరన్‌గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆల్‌మోస్ట్ నాకు మరో మావయ్య. నేరేషన్ టైమ్‌లో ఈ కథ విని ఎంత ఎంజాయ్ చేసానో షూటింగ్ టైమ్‌లో దాన్ని మించి ఎంజాయ్ చేస్తానని నమ్మకం వుంది. మా యంగ్, డైనమిక్, ఎనర్జిటిక్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. మా యంగ్ జనరేషన్‌తో కూడా సినిమా చేస్తున్నారంటే ఎంత స్టాండర్డ్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారో అర్థమవుతుంది. తప్పకుండా ఆయనకి ఒక మంచి సినిమా ఇస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను'' అన్నారు.
సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించే ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్ సి.ఎస్., సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేష్, కాస్ట్యూమ్స్: రత్నాజీ, మేకప్: కె.ఎస్.కిరణ్‌కుమార్, స్టిల్స్: వెంకట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీష్ కొప్పినీడి, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ వి., నిర్మాతలు: కె.ఎస్.రామరావు, కె.ఎ.వల్లభ, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.