సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా జవాన్ చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.
లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అంతేకాకుండా.. కరుణాకరన్ దర్శకత్వంలోనూ సాయిధరమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలను అందించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. డార్లింగ్ స్వామి మాటలను అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సందడి చేయనుంది.
సుప్రీమ్ తరువాత సరైన విజయం లేని సాయిధరమ్‌కి ఈ రెండు చిత్రాల సక్సెస్ కీలకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com