ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అందరినీ మెప్పించే ప్యూర్ లవ్ స్టోరీ 'తేజ్ ఐ లవ్ యు' - సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా భీమవరం విష్ణు కాలేజ్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ కరుణాకరన్, రైటర్ డార్లింగ్ స్వామి, నిర్మాత వల్లభ, జోష్ రవి, గోసాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వెంకట శివరామరాజు, రఘరామ కృష్ణంరాజు, ముత్యాల రత్నం హాజరయ్యారు.
ఈ సందర్భంగా...
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - ప్రేక్షకులను చూస్తే కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. మాది తాడేపల్లి గూడెం. కాలేజీ చదివే రోజుల్లో కాస్లులు ఎగ్గొట్టి.. భీమవరం వచ్చి సినిమా చూసేవాడిని. అందుకే నాకు భీమవరం అంటే ఇష్టం. తేజ్ ఐ లవ్ యు సినిమా మన సినిమా. మన పశ్చిమ గోదావరి సినిమా. మనలో ఎంత ఎటకారం ఉంటుందో అంతే ఎటకారం సినిమాలో ఉంటుంది. కరుణాకరన్‌గారు సినిమా తీస్తే మన వెస్ట్ గోదావరి వాళ్లు సినిమా తీసినట్లు ఉంటుంది. ఈ చిత్రంలో సాయిధరమ్‌ను చూసి లవర్ అంటే ఇలాగే ఉండాలని అమ్మాయిలు ఫీలవుతారు. సాయిధరమ్ తేజ్ పెర్‌ఫార్‌మెన్స్ వాళ్ల మావయ్యలు చిరంజీవిగారిలా, పవన్‌కల్యాణ్‌లా ఇరగదీసి చేశాడు. తన పెర్‌ఫార్‌మెన్స్‌ను చూసి సూపర్ అని అందరూ అంటారు. కరుణాకరన్‌గారి సినిమాలో హీరోయిన్ ఎంత బావుంటుందో మనకు తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ మంచి పెర్‌ఫార్మర్ అని మనకు తెలుసు. ప్రతి అమ్మాయి ఇలా ఉండాలని ఫీలయ్యేలా ఆమె క్యారెక్టర్ మెప్పిస్తుంది. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
డైరెక్టర్ కరుణాకరన్‌గారు దగ్గరుండి మంచి మ్యూజిక్‌ను చేయించుకున్నారు. నిర్మాత కె.ఎస్.రామారావుగారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక సినిమా స్క్రిప్ట్ విషయానికి వస్తే ప్రతి సీన్ యూత్‌ఫుల్‌గా ఉండాలని చేశారు. ప్రతి సీన్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. జూలై 6న సినిమా విడుదలవుతుంది. సినిమాను ఒకసారి కాదు.. ఒక్కొక్కరు మూడుసార్లు చూసేలా సినిమా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కథను కరుణాకరన్‌గారు ఏడాది పాటు కష్టపడి తయారు చేశారు. నాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. మా డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌గారికి రుణపడి ఉంటాను. పవన్‌కల్యాణ్‌గారి తొలిప్రేమ ఎలాగైతే బ్లాక్ బస్టర్, మిరాకిల్ అయ్యిందో.. తేజ్ ఐ లవ్ యు దానికన్నా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను`` అన్నారు.
గోసాల రాంబాబు మాట్లాడుతూ - ``మాది ఏలూరు. తేజ ఐ లవ్ యు సినిమాలో మంచి ఫ్యామిలీ సాంగ్ రాశాను. గత ఏడాది రైటర్‌గా మంచి సినిమాలకు పాటలు రాశాను. మంచి పేరు వచ్చింది. ఈ ఏడాది కూడా తేజ్ ఐ లవ్ యుతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. కరుణాకరన్‌గారు లవ్‌లీ మాంటేజెస్ సాంగ్స్‌ను పిక్చరైజ్ చేశారు. సాయిధరమ్‌తేజ్‌గారిని చూస్తే నాకు ఆయనలో చిరంజీవిగారు కనపడతారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది`` అన్నారు.
చిత్ర దర్శకుడు ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ - ``నా తొలి చిత్రం `తొలిప్రేమ`. నాకు అమ్మ నానన్న తర్వాతే నాకు పవన్‌కల్యాణ్‌గారే. నన్ను ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేసిన నిర్మాతలు, హీరోలకు థాంక్స్. అప్పుడు తొలిప్రేమను ఎంత బాగా ఎంజాయ్ చేశారో.. నా తమ్ముడు సాయిధరమ్‌తో చేసి `తేజ్ ఐ లవ్ యు`ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ఈ సీన్‌లో కూడా హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా బాగా వచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా నటించారు. అనయ్య పవన్‌కల్యాణ్‌గారితో ఎలాంటి ఫీలింగ్‌తో సినిమా చేశానో.. తమ్ముడితో కూడా అదే ఫీలింగ్ కలిగింది. మళ్ళీ మా అన్నయ్యను డైరెక్ట్ చేసినట్లు అనిపించింది`` అన్నారు.
రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ - ``మొగల్తూరులో పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా అంతటా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో చిరంజీవిగారు. అటువంటి చిరంజీవిగారి ఫ్యామిలీలో ముగ్గురు మేనమామల ముద్దుల మేనల్లుడు సాయిధరమ్ తేజ్. తేజ్ మన ఇంట్లో మనిషి. పవన్‌కల్యాణ్‌తో కరుణాకరన్‌గారు చేసిన తొలిప్రేమ చిత్ర టైటిల్‌ను వరుణ్‌తేజ్‌కు పెడితే అందరూ దాన్ని సూపర్‌హిట్ చేశారు. ఆ తొలి ప్రేమ తీసిన డైరెక్టర్, తేజ్‌తో `తేజ్ ఐ లవ్ యు` అంటూ ముందుకు వచ్చారు.
తొలిప్రేమకు ఎటువంటి విజయాన్ని అందించారో అటువంటి విజయాన్ని సాయిధరమ్ తేజ్‌కి అందించాలి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో నవరసాలున్నట్లుగా తెలుస్తుంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కరుణాకరన్‌గారి మలిప్రేమ తొలిప్రేమ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. నిర్మాత కె.ఎస్.రామారావుగారు నాకు మంచి మిత్రుడు.ఆయన 45 సినిమాలు చేస్తే అందులో 30 సినిమాలు సూపర్‌హిట్‌లే. ఒకటి, అరా సరిగా ఆడకపోయినా.. ఆయన బ్యాడ్ ఫిలింస్ ఎప్పుడూ చేయలేదు. మంచి టేస్ట్‌ఫుల్ డైరెక్టర్, నిర్మాత కాంబినేషన్‌లో వస్తోన్నఈ సినిమా 50 రోజుల ఫంక్షన్‌ని కూడా ఈ కాలేజ్‌లోనే చేస్తాం`` అన్నారు.
వెంకట శివరామరాజు మాట్లాడుతూ - ``ట్రైలర్‌లో తేజ్ పెర్‌ఫార్‌మెన్స్ చాలా బావుంది. ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ కావాలని, తేజ్‌కు చాలా మంచి పేరు తేవాలని.. మనం గర్వపడేలా ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నాను`` అన్నారు.
ముత్యాల రత్నం మాట్లాడుతూ - ``నటనలో ఎవరి అండదండలు లేకుండా తన కాళ్ళపై తను నిలబడి మద్రాస్ వెళ్లి స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి.. ఇండియాలోనే అందరి తారలతో సమానస్థాయిని సంపాదించుకున్న వ్యక్తి చిరంజీవిగారు. మేనమామల పోలికలున్న సాయిధరమ్ తేజ్ కూడా స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. తేజ్ మేనమామల స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ మాట్లాడుతూ - ``తేజ్ ఐ లవ్ యు` ప్యూర్ లవ్ స్టోరీ. ప్యామిలీ ఎమోషన్స్ సినిమాలో కొంత పార్ట్ ఉంటుంది. లవ్ లీ ఫిలిమ్, ఫన్ రైడింగ్, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నాకు ముగ్గురు మావయ్యల కష్టమే నేను ఈ స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. `తొలి ప్రేమ` తీసిన డైరెక్టర్ 20 ఏళ్ల తర్వాత నాతో ఈ సినిమా తీయడం చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంది. సపోర్ట్ చేసిన అదరికీ థాంక్స్`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout