సాయిధరమ్ పెంచేస్తున్నాడు కానీ..

  • IndiaGlitz, [Saturday,September 02 2017]

ఇప్ప‌టివ‌ర‌కు ఏడు చిత్రాల్లో సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్.. త‌న ఖాతాలో ముచ్చ‌ట‌గా మూడు విజ‌యాల‌(పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్‌)ను జ‌మ చేసుకున్నాడు. అయితే గ‌తేడాది విడుద‌లై విజ‌యం సాధించిన 'సుప్రీమ్' త‌రువాత సాయికి మ‌రో విజ‌యం లేదు. 'తిక్క‌', 'విన్న‌ర్‌', 'న‌క్ష‌త్రం' ఇలా వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లు అత‌నిని వెంటాడాయి. ఈ నేప‌థ్యంలో తాజా చిత్రం 'జ‌వాన్‌'పై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడీ యువ క‌థానాయ‌కుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. సాయి కెరీర్‌ని గ‌మ‌నిస్తే.. గ‌త రెండేళ్లుగా రెండేసి సినిమాల‌తోనే ప‌ల‌క‌రిస్తూ వ‌స్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య‌ మూడుకి చేరుతోంది. ఇక వ‌చ్చే ఏడాదిలో వి.వి.వినాయ‌క్‌, క‌రుణాక‌ర‌న్ వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో చేస్తున్న సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఏదేమైనా.. సాయిధ‌ర‌మ్ సినిమాల సంఖ్య‌ని పెంచ‌డం అయితే చేస్తున్నాడు కానీ..కంటెంట్ పైన కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌లేక‌పోతున్నాడ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల‌తోనైనా సాయిధ‌ర‌మ్‌ ఆ ముద్ర‌ను చెరిపేస్తాడేమో చూడాలి.

More News

పవన్ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్..

'జల్సా','అత్తారింటికి దారేది'వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,

బెల్లంకొండ తరువాత రామ్ చరణ్ తోనే..

సమంత.. ఎంతోమంది యువ కథానాయకులకు కష్ట కాలంలో కలిసొచ్చిన కథానాయిక.

చేతన్ చీను 'దేవదాసి' మోషన్ పోస్టర్ విడుదల

రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను,సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి'

నితిన్ కి ఆయన శిష్యుడైనా కలిసొస్తాడా?

గతేడాది 'అఆ'తో ఓ బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ కి..

రకుల్ ఆవిషయంలో హ్యాట్రిక్ కొడుతుందా?

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్.